వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు | Third party motor insurance premium rates set to go up to 50% from April | Sakshi
Sakshi News home page

వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు

Published Wed, Mar 29 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు

థర్డ్‌ పార్టీ ప్రీమియంను 41 శాతం పెంచుతూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులు
ముంబై: వాహన బీమా  థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్లను 41 శాతం వరకు పెంచుతూ ఐఆర్డీఏఐ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక లీటర్‌కు మించి ఒకటిన్నర లీటర్‌ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు థర్డ్‌ పార్టీ ప్రీమియం ప్రస్తుతం రూ.2,237 ఉండగా తాజా పెంపుతో అది రూ.3,132కు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏ తెలిపింది. ఒక లీటర్‌ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు పెంపు వర్తించదు.

ప్రైవేటు నాలుగు చక్రాల వాహనాలు 1,500 సీసీ సామర్థ్యం కంటే అధికంగా ఉన్న వాటికి ప్రీమియం రూ.6,164 ఉండగా, తాజా పెంపుతో రూ.8,630 కానుంది. రూ.7,500 కిలోల కంటే అధిక లోడ్‌ సామర్థ్యం గల వాణిజ్య వాహనాలకు ప్రీమియం తగ్గుతుంది. 75 సీసీ వరకు గల ద్విచక్ర వాహనాలకు పెంపు లేదు. ఆపై 150 సీసీ వరకు ఉన్న వాటికి ప్రీమియం రూ.619 నుంచి 720కి పెరుగుతోంది. ఆపై 350 సీసీ వరకు గల వాహనాలకు రూ.970, అంతకు మించితే రూ.1,114 ప్రీమియం ఉంటుంది. త్రిచక్ర వాహనాలకు ప్రీమియం రూ.4,200 నుంచి రూ.5,680కి పెరగనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement