పోస్టాఫీసుల్లోనూ గోల్డ్ బాండ్లు.. Sovereign Gold Bonds in post office also | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లోనూ గోల్డ్ బాండ్లు..

Published Sat, Oct 29 2016 12:22 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

పోస్టాఫీసుల్లోనూ గోల్డ్ బాండ్లు.. - Sakshi

సాక్షి, హైదరాబాద్:  పోస్టల్ శాఖ ‘గోల్డ్ బాండ్‌‘ అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో భాగంగా పోస్టాఫీసుల్లో  బాండ్‌లను అందుబాటులో ఉంచారు. 999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ధర ప్రకారం విలువను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ సగటు ఒక గ్రాము బంగారం ధర రూ. 3007 ఉండగా, రూ. 50లు డిస్కౌంట్‌తో రూ.2957 చొప్పున బాండ్‌ను పోస్టాఫీసుల్లో విక్రరుుస్తున్నారు.

ఇన్వెస్టర్లు 1 గ్రాము నుంచి 500 గ్రాముల విలువ గల గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయవచ్చు.  బాండ్ విలువపై ప్రతి  సంవత్సరానికి ఫిక్స్‌డ్ వడ్డీ  2.50 శాతం వర్తింప జేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బాండుహోల్డరు బ్యాంక్ ఖాతాలో ఫిక్స్‌డ్ వడ్డీ జమ అవుతుంది. బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా, ఐదేళ్ల తర్వాత బాండ్‌ను నగదుగా మార్చుకోవచ్చు. ఆ సమయంలో మార్కెట్‌లో గల బంగారం ధర విలువను నగదు రూపంలో పెట్టుబడిదారులకు అందిస్తారు. గోల్డ్ బాండ్ ఆధారంగా బ్యాంకుల్లో రుణం కూడా పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. 

30 వేల బాండ్ల విక్రయాల లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 వేల గోల్డ్ బాండ్లను విక్రరుుంచాలని పోస్టల్ శాఖ లక్ష్యాన్ని నిర్ణరుుంచింది. రాష్ట్రంలో మొత్తం 95 ప్రధాన పోస్టాఫీసులు, 2,353 సబ్ పోస్టాఫీస్‌లు,13,712 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నారుు.   ఈ నెల 24న గోల్డ్ బాండ్ పథకం ఆరో విడత ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సుమారు 1500పైగా బాండ్‌‌స అమ్ముడు పోరుునట్లు పోస్టల్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. మదుపుదారులు గోల్డ్ బాండ్ కోసం విలువ రూ.20 వేలు మించితే చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రవాస భారతీయులకు వర్తించదు. నవంబర్ 2 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement