పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్‌  వినియోగదారులు | Growing broadband users | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్‌  వినియోగదారులు

Published Sat, Nov 24 2018 1:40 AM | Last Updated on Sat, Nov 24 2018 1:40 AM

Growing broadband users - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. డేటా వినియోగం భారీగా వృద్ది చెందుతోందని, ఈ ఏడాది ఆగస్టులో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య 46.36 కోట్లకు పెరిగిందని టెలికం డిపార్ట్‌మెంట్‌(డీఓటీ) తెలిపింది. అంతకు ముందటి నెల జూలైలో ఉన్న వినియోగదారుల సంఖ్య(46 కోట్లు)తో పోల్చితే 0.74 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. డాట్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., 

∙ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో మొత్తం ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 97.3 లక్షలు పెరిగి 118.9 కోట్లకు చేరింది. వీరిలో వైర్లైన్‌ ఫోన్‌ వినియోగదారుల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, వైర్లెస్‌ వినియోగదారుల సంఖ్య 0.84 శాతం వృద్ధిచెంది 116.7 కోట్లకు ఎగసింది. 
∙ఈ ఆగస్టులో మొత్తం ఫోన్‌ కనెక్షన్లు అధికంగా ముంబైలో పెరిగాయి. ముంబైలో 19.35 లక్షల ఫోన్‌  కనెక్షన్లు పెరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement