డా.రెడ్డీస్‌కు మరో షాక్‌ | Dr Reddy's falls on buzz of issues raised in EIR for Duvvada plant  | Sakshi
Sakshi News home page

డా.రెడ్డీస్‌కు మరో షాక్‌

Published Wed, Jan 3 2018 5:08 PM | Last Updated on Wed, Jan 3 2018 5:08 PM

Dr Reddy's falls on buzz of issues raised in EIR for Duvvada plant  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి  షాక్‌  తగిలింది.  ఆంధ్రప్రదేశ్‌,  విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్స్‌పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా.రెడ్డీస్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది.

ఫార్మా సెక్టార్‌లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్టేనని  ఎనలిస్టులు  చెబుతున్నారు..  2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్‌ఎఫ్‌డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్‌ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది.  దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొన్నట్లు  స​మాచారం. దీనిపై డా.రెడ్డీస్‌ను వివరణకోరామని  మార్కెట్‌ రెగ్యులేటరీ తెలిపింది.  

తాజా  రిపోర్ట్‌పై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే  నవంబర్ 21, 2017న  విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ అందినట్టు  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్‌ తెలిపింది. కానీ సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా లేదని చెప్పింది.

కాగా అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ   కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్‌ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను  ఉన్నట్టు గుర‍్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు  జనవరి 25న  బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌  సమావేశం నిర్వహిస్తున్నట్టు  సోమవారం ప్రకటించింది.  గత నెలగా రెడ్డీస్‌  కౌంటర్‌ 8శాతానికిపైగా లాభపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement