తాళం పగలగొట్టి.. క్వారంటైన్‌ నుంచి పరారీ Two People Escape From Mylavaram Quarantine Centre | Sakshi
Sakshi News home page

తాళం పగలగొట్టి.. క్వారంటైన్‌ నుంచి పరారీ

Published Thu, Apr 23 2020 4:49 PM | Last Updated on Thu, Apr 23 2020 5:07 PM

Two People Escape From Mylavaram Quarantine Centre - Sakshi

సాక్షి, మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు(33), నరసమ్మ (30) అనే మహిళ నాలుగు రోజుల క్రితం మైలవరం బంధువులు ఇంటికి రాగా.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అధికారులు వారిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.
(ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు)

గురువారం తెల్లవారు జామున క్వారంటైన్‌ కేంద్రం వెనుక గేట్‌ తాళం పగలకొట్టి  ఇద్దరు పరారైనట్లు సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఇద్దరు కోదాడ పట్టణానికి చేరినట్లు సమాచారం. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement