చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం Rs.2 crores for cheating | Sakshi
Sakshi News home page

చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం

Published Wed, Jun 13 2018 2:13 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

Rs.2 crores for cheating - Sakshi

సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్‌ దామోదరన్‌ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement