రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్ | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్

Published Fri, Nov 21 2014 1:18 AM

రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్

సైబర్ నేరం కింద పోలీసుల కేసు నమోదు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హుద్‌హుద్ తుపాను సమయంలో మండలంలో ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే వెబ్‌సైట్ హ్యాక్ చేసిన ఆకతాయిలు రణస్థలం మండల వాసులు 69 మంది తుపానుకు చనిపోయినట్టు వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఈ మేరకు తహశీల్దార్ ఎం.సురేష్‌కుమార్ వెబ్‌సైట్ హ్యాకింగ్ అయినట్లు బుధవారం రణస్థలం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్‌బాబు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement