'కేంద్రం నుంచి లేఖ రాగానే డీఎస్సీ నోటిఫికేషన్' | No decision on Teachers transfer in AndhraPradesh , says Minister Ganta SrinivasaRao | Sakshi
Sakshi News home page

'కేంద్రం నుంచి లేఖ రాగానే డీఎస్సీ నోటిఫికేషన్'

Published Tue, Sep 16 2014 1:25 PM | Last Updated on Sat, Jun 2 2018 5:56 PM

'కేంద్రం నుంచి లేఖ రాగానే డీఎస్సీ నోటిఫికేషన్' - Sakshi

హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్పై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోద ముద్ర వేయలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం సాధ్యమైనంత త్వరలో ఆమోదముద్ర వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి కేంద్రం నుంచి లేఖ రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్లో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ,ఎన్ఐటీ, ఐఐఎస్ఈఏఆర్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలన చేస్తున్నట్లు వివరించారు.

ఆ సంస్థల ఏర్పాటు కోసం గురు, శుక్రవారాల్లో జాతీయ విద్యాసంస్థల కమిటీలు పర్యటిస్తాయని చెప్పారు. అందుకోసం కర్నూలు, తిరపతి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో స్థలాలను ఆ కమిటీలు పర్యటిస్తాయని తెలిపారు. టీచర్ల బదిలీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఓ విలేకర్లు అడిగిన ప్రశ్నకు గంటా సమాధానమిచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement