‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్ | decreasing the dropout in Kasturba Gandhi Balika Vidyalaya | Sakshi
Sakshi News home page

‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్

Published Fri, Dec 27 2013 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

decreasing the dropout in Kasturba Gandhi Balika Vidyalaya

లోకేశ్వరం, న్యూస్‌లైన్ :  కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంల ఏర్పాటుతో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బడి మానేసిన వారి ని చేర్పించి విద్యతోపాటు వృత్తివిద్యపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2009 జూన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలో ఎనిమిది విద్యార్థులు చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011-12లో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఉండగా.. 2012-13 నాటికి 20కి తగ్గింది. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు.

 విద్యాలయాన్ని రూ.38.75లక్షలతో, అదనపు గదుల నిర్మాణాన్ని రూ.31.08లక్షలు, ఎఫ్‌ఎఫ్ నిధులు రూ.30లక్షలతో చేపట్టారు. విద్యార్థులకు కుట్టుశిక్షణ, అల్లికలు, ఎంబ్రయిడరీ, ఆటపాటలపై శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల దుస్తులు, జామెట్రిక్ బాక్స్, బ్లాంకెట్, కార్పెట్, పళ్లెం, గ్లాసు, ప్రతి నెలా తరగతి ఆధారంగా రూ.55 నుంచి రూ.75వరకు కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తున్నారు. బడిమానేసిన వారిని పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నామని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement