శీనన్న మాటంటే మాటే D Srinivas praises Sonia Gandhi | Sakshi
Sakshi News home page

శీనన్న మాటంటే మాటే

Published Thu, Aug 8 2013 4:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

D Srinivas praises Sonia Gandhi

పలువురు జాతీయ నాయకుల వద్ద తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రెండు గంటల పాటు వివరిస్తే... ఓపిగ్గా విన్న వారు ఇంత అన్యాయాన్ని ఎలా భరిస్తున్నారని అడిగారని తెలిపారు. ఉద్యోగులు,విద్యార్థులు,ప్రజా సంఘాలు,రాజకీయ జేఏసీ, కార్మికులు, మహిళలు, ప్రజల పోరాటలతో పాటు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ  బిల్లు ఆమోదయోగ్యం అయ్యేంత వరకు మనమంతా ఓర్పుతో ఉండాలని డీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో నిజామాబాద్‌లోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేశారని పేర్కొన్నారు.
 
 తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలోని మైనింగ్,మినరల్,సింగరేణి వంటి గనులు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా నీటి వనరులను పెంచుకుని బీడు భూములను సాగులోకి తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమారస్వామి పాత్రను పోషిస్తే, తాను వినాయకుడిగా జీవించానని.. కథను డీఎస్ సభికులకు వినిపించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వైద్యకళాశాలకు తెలంగాణ పేరు పెట్టేవిధంగా ప్రతిపాదనలు చేసినట్లు డీఎస్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని సమష్టి కృషితో సాధించుకున్నామన్నారు.
 
  తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆయన సభలో జోహార్లు అర్పించారు. సభికులతో ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయించారు. డీఎస్‌ను రాజకీయ, ఉద్యోగ, కుల సంఘాలు, విద్యార్థి, కార్మిక, న్యాయవాద, డాక్టరు జేఏసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షత వహించగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్, పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సతీష్‌పవార్, అరుణతార, మాజీ మేయర్ సంజయ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, సురేందర్, రత్నకర్, రాజేంద్రప్రసాద్‌లు పాల్గ్గొన్నారు.
 
 మంత్రి, విప్ గైర్హాజరు....
 తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరువాత మొదటి సారిగా నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభకు మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి,ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలు దూరంగా ఉన్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరవర్గంలోని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ మినహా మిగితా అందరూ గైర్హాజరయ్యారు. మూడు రోజుల కిందట మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అనుచరవర్గాలు కూడా దూరంగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఫ్లెక్సీల ఏర్పాటులోనూ ఈ వ్యత్యాసం కనిపించింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాటగా కొనసాగుతోంది. మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీఎస్ అనుచరులు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పంచుకుంటుండగా, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, విప్ అనిల్ మూడవ వర్గంగా వ్యవహరిస్తున్నారు. సమయం, సందర్భాలను బట్టి మూడవ వర్గంగా వ్యవహరిస్తున్న నాయకులు, వారి అనుచరులు అటు డీఎస్‌తోనూ, ఇటూ పీఎస్‌తోనూ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న విభేదాలు కార్యకర్తలను తీవ్ర ైనైరాశ్యానికి గురిచేస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement