బాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి babu should resign | Sakshi
Sakshi News home page

బాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి

Published Thu, Jun 18 2015 3:33 AM | Last Updated on Thu, Aug 9 2018 4:43 PM

బాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి - Sakshi

- ఏడాదిలో బాబు పాలన అవినీతిమయం
- ‘ఓటుకు నోటు’లో దొరికిపోయి రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు
- ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి
పీలేరు:
ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేసి, నిజాయితీ నిరూపించుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ అడ్డంగా దొరికిపోయిన విష యం దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఈ కేసులో  నుంచి బయటపడడానికి సీఎం దారులు వెతుక్కుం టున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏడాది చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నిజాయితీ ఏ పాటిదో ఆడియో టేపులు చూసిన ప్రతిఒక్కరికీ అర్థమవుతుందన్నారు.

తన స్వార్థం కోసం సీఎం తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అవినీతి వ్యవహారంలో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి దీనివెనుక జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బీడీ.నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాష, జీ.జయరామచంద్రయ్య, రెడ్డిరాజ, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాష, నేతలు కడప గిరిధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆనంద్, కరుణాకర్‌రెడ్డి, ఎస్.గౌస్‌బాష, షాకీర్, ఉదయ్, రమేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, కుమార్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement